Thursday, May 2, 2024

Priyanka Chopra : జెస్ట్ అర‌వై లక్ష‌లేనా….

సెలబ్రిటీస్ ఏం చేసినా.. ఎటువంటి వస్తువులు వాడినా.. అది హాట్ టాపిక్ అవుతుంది ఈరోజుల్లో. మరీముఖ్యంగా స్టార్స్ కాస్ల్టీగా ఏమైనా వేసుకుంటే.. నెట్టింట రచ్చ స్టార్ట్ అయినట్టే.. తాజాగా ప్రియాంక చోప్రా స్నేక్ నెక్లస్ అలాగే వైరల్ అవుతోంది.
టాలీవుడ్, బాలీవుడ్ , హాలీవుడ్.. ఇలా అంచలంచలుగా ఎదిగిన తార ప్రియాంక చోప్రా. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగింది ప్రియాంక చోప్రా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇండియన్ ఫ్రిల్మ్స్ తో పాటు హాలీవుడ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

- Advertisement -

ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా వదిలేసి ఎక్కువగా హాలీవుడ్ లోనే నటిస్తోంది. ఇక హాలీవుడ్ లో కూడా ప్రియాంక చోప్రాకు వరుస అవకాశాలు రావడంతో పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అక్క‌డే వందల కోట్లతో ఇల్లు కొన్న ప్రియాంక.. లాస్ ఎంజల్ నుంచి అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ పోతూ ఉంది. తాజాగా నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రియాంక అదిరిపోయే గెటప్.. డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంది. అందరిని సర్ ప్రైజ్ చేసింది.

ముఖ్యంగా ఆమె ధ‌రించిన నెక్లెస్ చూడడానికి చాలా వెరైటీగా కనిపించడమే కాదు.. దాని ధర కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ప్రియాంక చోప్రా వేసుకున్న ఆ పాము నెక్లెస్ ధర ఎంతో తెలుసా..? ఆ స్నేక్ నెక్లెస్ ధర అక్షరాల 60 లక్షలట. అంత కాస్ట్ పెట్టి కొన్న ఈ నెక్లెస్ సింపుల్ గా ఉంది. దాంతో ఇంత సాదాగా ఉన్న నగ అంత రేటా అని నెటిజన్లు నోరు వెళ్ళబెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement