Monday, April 29, 2024

ప్రియా ప్రకాష్ వారియర్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

ఒక్క కన్నుగీటు తో స్టార్ గా మారిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె చూపులతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నెగటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించినా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఈ అమ్మడు ఇష్క్… నాట్ ఎ లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ తో సినిమా చేస్తోంది. ఎస్ ఎస్ రాజు దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేర పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈనెల 23వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement