Wednesday, May 1, 2024

పూరి జగన్నాథ్ కు థాంక్స్ చెప్పి లాయర్ నందా

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ ని వెండితెరపై అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ కు అపోజిట్ లాయర్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించారు. గతంలోనే ట్రైలర్ తోనే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ టాప్ లేపారు. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పేరు నందా కావటం విశేషం.

గతంలో బద్రి సినిమాలో కూడా ప్రకాష్ రాజు పేరు నందానే. దీంతో ప్రకాష్ రాజు పూరి జగన్నాథ్ కు థాంక్స్ చెప్పారు. అలాగే ఆ కాంబోను మళ్ళీ రిపీట్ అయ్యి వకీల్ సాబ్ తో మ్యాజిక్ చేసిందని అన్నారు ప్రకాష్ రాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement