Friday, April 26, 2024

ఆసుపత్రి నుంచి ప్రకాష్ రాజ్ డిశ్చార్జ్

నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. చెన్నై లో జరుగుతున్న షూటింగ్ లో జారిపడ్డ ప్రకాష్ రాజ్ స్వల్పంగా గాయపడ్డారు. దానికి సర్జరీ అవసరం కావడంతో తో హైదరాబాద్ లోని తన స్నేహితుడు గురువారెడ్డి దగ్గర సర్జరీ చేయించుకున్నారు.

ఆ తర్వాత డెవిల్ ఇస్ బ్యాక్ అంటూ ట్విట్టర్ లో ఫోటోలను పోస్ట్ చేశారు. అలాగే ఆదివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ని కూడా ఎగరవేశారు. అయితే ప్రకాష్ రాజ్ తాజాగా ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement