Saturday, February 24, 2024

రేపు మహబూబాబాద్ జిల్లాలో షర్మిల నిరాహారదీక్ష

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మూడురోజుల పాటు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రేపు మహబూబాబాద్ జిల్లా గుండెంగి గ్రామంలో ఉద్యోగ దీక్ష చేయనున్నారు. అనంతరం రేపు రాత్రి వరంగల్ పట్టణంలోనే షర్మిల బస చేయనున్నారు. ఉద్యోగ దీక్షతో పాటు పోడు భూముల పోరుకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు.

మరోవైపు ఎల్లుండి (బుధవారం) ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ షర్మిల.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతున్న వైఎస్ షర్మిల గత మంగళ వారం హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉద్యోగ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: దళిత బంధుకు మరో రూ.2 వేల కోట్లు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement