Wednesday, May 1, 2024

సౌత్ నుంచి ప్రభాస్ ఒక్కడే!!

బాహుబలి సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్,రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రభాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందులో భాగంగానే ఫేస్ బుక్ లో అత్యధిక మంది ఫాలో అవుతున్న టాప్ టెన్ ఇండియన్స్ లో ప్రభాస్ చోటు దక్కించుకున్నారు. 2.4 కోట్ల ఫాలోవర్స్ తో 9వ స్థానంలో నిలిచాడు ప్రభాస్. సౌత్ ఇండియన్ నుంచి ప్రభాస్ ఒక్కడే నిలవడం విశేషం. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 5 కోట్లతో ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలవగా… అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ ,అమితాబ్ వరుస స్థానాల్లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement