Friday, May 3, 2024

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ ఫిక్స్.. భారీగా ప్లాన్ చేసిన మేకర్స్

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.. 16 జూన్ న విడుదల కానుంది. ఈ పాన్-ఇండియా మూవీ విడుదలకు ఇంకా 2 నెలల కంటే తక్కువ సమయం ఉండటంతో, దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్‌లకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.. దీంతో ఇప్పుడు అభిమానుల ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నారు.

ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 8న గ్రాండ్ ఈవెంట్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా, రీసెంట్ కా రిలీజ్ అయిన కొత్త పోస్టర్, జై శ్రీరామ్ పాట సినిమాకు మొదట్లో సినిమాపై వచ్చిన నెగిటివిటీని తిప్పికొట్టడంలో బాగా సహాయపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement