Sunday, April 21, 2024

నర్సాపూర్ నుండి బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్-బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్-బెంగళూరు ప్రత్యేక రైలు (07153) మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07154) మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

రెండు రూట్లలో రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కోటపాడి, బంగారపేట స్టేషన్లలో ఆగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement