Wednesday, May 15, 2024

స‌మంత య‌శోద‌కు పాజిటివ్ టాక్‌.. స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్‌

ఓ బేబీ తరువాత సమంత నటించిన లేడీ ఓరియేంటెడ్ మూవీ ‘యశోద’. ఈ మూవీ నిన్న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సోంతం చేసుకుంది. ఐదు భాషల్లో రిలీజైన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ తదితరులు నటించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే రూ.1.70 కోట్లు రాబట్టింది యశోద మూవీ. కాగా, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని భారీ ధరకి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన మూవీ సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దం అవుతుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో మాత్రమే మూవీ థియేటర్లలో బాగా ఆడుతున్నప్పుడు ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ మేరకు కొన్ని రోజులు ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నవంబరు 11న రిలీజైన యశోద మూవీ డిసెంబరు రెండో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement