Sunday, May 26, 2024

నేను ప్రెగ్నేంట్.. ప్రకటించిన నటి పూజా రామచంద్రన్

ఈ మధ్య కాలంలో సినీ తారలు కొందరు వరుసగా తల్లులుగా మారుతున్నారు. కాగా మరో నటి తాను ప్రెగ్నెంట్ అని ఎనౌన్స్ చేసింది. ఆమె మరెవరో కాదు నటి పూజా రామచంద్రన్.తన భర్త జాన్ కొకెన్ తో పాటు రొమాంటిక్ ఫోజుల్లో దిగిన ఫొటోలో ట్విట్టర్ లో షేర్ చేశారు. అనేక భావోద్వేగాల మా జర్నీ మరో కీలక దశకు చేరింది. వచ్చే ఏడాది మా కుటుంబంలోకి మరొక వ్యక్తి వస్తున్నారని పూజా ట్వీట్ చేశారు. పూజా రామ చంద్రన్ 2019లో కెజిఎఫ్ ఫేమ్ జాన్ కొకెన్ ని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది రెండో వివాహం. 2017లో పూజా రామచంద్రన్ విజె క్రెగ్ ని వివాహమాడారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు జాన్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వామి రారా చిత్రంతో పూజా రామ చంద్రన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో నిఖిల్ క్రైమ్ పార్టనర్ గా పూజా రామ చంద్రన్ నటించారు. బిగ్ బాస్ షోతో ఆమె మరింత చేరవయింది. నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 లో పూజా రామచంద్రన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement