Sunday, May 19, 2024

ఐశ్వ‌ర్యారాయ్ సంస్కారం.. మ‌ణిర‌త్నం కాళ్ల‌కి న‌మ‌స్కారం

ఎంత ఎదిగినా ఒదిగిఉండే గుణం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్యారాయ్ సొంత‌మ‌నే చెప్పాలి. దీనికి నిద‌ర్శ‌నంగా మ‌రో సంఘ‌ట‌న జ‌రిగింది. కాగా పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్‌లతో తెగ బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా చిత్రబృందం ముంబైలో ఓ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్‌లో అరుదైన ఇన్సిడెంట్ జరిగింది. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఐశ్వర్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మణిరత్నం దర్శకత్వం వహించిన ఇద్దరూ సినిమాతోనే. ఈ సినిమా ఐశ్వర్య రాయ్‌కు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా వీళ్ల కాంబోలో గురు, విలన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ వంటి సినిమాలు వచ్చాయి. ఇలా తన మొదటి సినిమా సహా కెరీర్‌లో పలు మెమరబుల్ చిత్రాలను అందించిన మణిరత్నంను గురువుగా భావించే ఐశ్వర్య ప్రెస్‌మీట్‌లో మణిరత్నం కాళ్లకు నమస్కారం చేసింది. పొన్నియన్‌ సెల్వన్‌లో ఐశ్వర్య పజువూరు యువరాణి నందిని పాత్రలో నటించింది. ఇక సెకండ్‌ పార్ట్‌లో ఐశ్వర్య పాత్ర కీలకమని తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement