Sunday, May 5, 2024

రాజ‌కీయాలు నాకు సెట్ కావు.. దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ సినిమాలే కాదు సామాజిక‌సేవ‌లో కూడా ముందుంటారు. ఈమేర‌కు నిజామాబాద్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తన సొంతూరు నర్సింగ్ పల్లి లో ఇందూరు – తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మించారు స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. అంతేకాకుండా ఆలయంలో చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఆయుర్వేద మందులను కూడా అందిస్తున్నారు. ఇటీవల దిల్ రాజు కుమార్తె హన్సిత, అన్న కుమారుడు హర్షిత్ నిర్మించిన బలగం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలలో మంత్రి కేటీఆర్ ని దిల్ రాజు పొగడడంతో రాజకీయాలలోకి రావాలని సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది. దీంతో ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. రాజకీయాలలోకి రావాలని నాకు చాలా ఆఫర్లు ఉన్నాయి. కానీ నేను రాను. సినిమా జీవితంలోనే నన్ను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇక రాజకీయాలలోకి వచ్చాక తట్టుకోగలనా. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలలోకి వచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో దిల్ రాజు రాజ‌కీయ ప్ర‌వేశంపై క్లారిటీ వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement