Sunday, June 13, 2021

బిగ్ బాస్‌5 లో పాయ‌ల్..? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 5 లో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ని షో కోసం ఎంపిక చేసిన‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ విష‌యం పాయ‌ల్ ద‌గ్గ‌ర‌కు కూడా చేర‌డంతో వెంటనే త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. నేను బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. అది ఫేక్ న్యూస్. ఇలాంటి వార్త‌ల‌లోకి న‌న్ను లాగొద్దు అంటూ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న ట్విట్టర్‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం పాయ‌ల్ కెరియ‌ర్ అంత ఆశాజ‌న‌కంగా లేదు.ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత ఈ అమ్మ‌డికి ఒక్క పెద్ద హిట్ కూడా లేక‌పోవ‌డంతో మంచి హిట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతుంది. ప్ర‌స్తుతం ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Prabha News