Thursday, April 25, 2024

‘వకీల్ సాబ్’ స్ఫూఫ్.. ‘లాయర్ సాబ్’ ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన‘వకీల్ సాబ్’ ఈనెల 9న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాకు కవర్ ట్రైలర్‌గా షకలక శంకర్ ‘లాయర్ సాబ్’ తెరకెక్కింది. ఈ కవర్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ‘సంతోషం’ పత్రిక ఫేం సురేష్ కొండేటి ఈ ట్రైలర్‌ను నిర్మించడం విశేషం. పవన్ మాదిరిగా ముగ్గురు అమ్మాయిలను కాపాడడం కోసం న్యాయపోరాటం చేసే లాయర్‌గా షకలక శంకర్ కనిపించాడు. ఇక ట్రైలర్ ముగిశాక ఓ ఫ్యాన్‌గా తన అభిమానం చాటుకున్నాడు. ట్రైలర్ కోసం థియేటర్స్ దగ్గర సందడి చేసిన ఫ్యాన్‌గా తన అభిమానం చాటుకున్నాడు. ట్రైలర్ కోసం థియేటర్స్ దగ్గర సందడి చేసిన ఫ్యాన్స్ చూపిస్తూ అభిమానం అంటే అది అని చెప్పాడు. పవన్ అభిమానులు థియేటర్ అద్దాలు పగులగొట్టిన వీడియో చూపిస్తూ… కావాలని ఎవరూ చేయరని, ఇది అనుకోకుండా జరిగిందని అభిమానులకు మద్దతిచ్చాడు. ట్రైలర్‌కు అద్దాలు బద్దలైతే.. సినిమాకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం అని షకలక శంకర్ పంచ్ వేశాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement