Friday, May 3, 2024

భీమ్లా నాయక్‌ పాటపై తెలంగాణ పోలీసుల ఆగ్రహం..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్‌’ నుంచి విడుదలయిన టైటిల్ ట్రాక్ యూట్యూబులో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ పాటలో పోలీసుల గురించి వచ్చిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ ఎం.రమేశ్‌ భీమ్లా నాయక్‌ సాంగ్ విన్న అనంతరం ఓ ట్వీట్‌ చేశారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్‌ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్‌ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్‌ అధికారి రమేశ్‌ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్‌ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు.

   ఇక రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు ఈ సాంగ్ లేదని ఓ నెటిజన్ కామెంట్ చేయగా దానికి రిప్లైయ్ ఇచ్చారు శాస్త్రీ.  రామజోగయ్యను ట్యాగ్‌ చేస్తూ ఓ నెటిజన్‌ ఈ లిరిక్స్ ‘మీ రేంజ్‌ లిరిక్స్‌ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్‌ చేయగా ‘నెక్ట్స్‌ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్‌’ అని శాస్త్రి రిప్లయ్‌ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్‌ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.  

ఇది కూడా చదవండి: కరోనా నిరోధంపై కేసీఆర్ సర్కార్ కు చిత్తశుద్ధి ఉందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement