Tuesday, May 21, 2024

OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘‘భగవంత్ కేసరి’’.. ఎక్కడంటే !

గాడ్ మాసెస్, నందమూరి నటసింహం బాలయ్య ప్రధనా పాత్రలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దసరా కానుకగా అక్టోబర్ 19న రిలజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలయ్య యాక్టింగ్, డైలాగ్స్, అనిల్ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుకోవడంతో.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్మురేపింది.

ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీకి రెడీ అయ్యింది. ‘భగవంత్ కేసరి’ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్.. ఈనెల 24 నుంచి ఈ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలిపింది. ఇక, దీంతో థియేటర్లలో ఈ సినిమా చూడని అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement