Saturday, May 4, 2024

షూటింగ్ పూర్తిచేసుకున్న‌ “ఊరి పేరు భైరవకోన” సినిమా.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ రివీల్

తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ మైఖేల్ పరాజయం తర్వాత, హీరో సందీప్ కిషన్ తన నెక్ట్స్ మూవీ ఊరి పేరు భైరవకోనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. సినిమా మొత్తం షూటింగ్ పూర్తయినట్లు తన సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు సందీప్.

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, కుశీ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కాగా, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement