Thursday, May 2, 2024

బర్త్ డే స్పెషల్… రంగమార్తాండ నుంచి ప్రకాష్ రాజు లుక్ రిలీజ్

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. మరాఠీ సూపర్ హిట్ సినిమా నటసమ్రాట్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా నేడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కు సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఆ ఫోటోలో సీనియర్ నటి రమ్యకృష్ణ తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విశ్వరూపం చూపించబోతున్నారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా విడుదలపై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా తరువాత అన్నం పరబ్రహ్మ స్వరూపం సినిమాను కృష్ణవంశీ చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement