Friday, April 26, 2024

ఓటీటీ నుంచి ఖిలాడి కి అదిరిపోయే ఆఫర్ ?

మాస్ మహారాజా రవితేజ… రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. మొదట మే 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే భారీ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇక రవితేజ ఇటీవలే క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఖిలాడి మీద అంచనాలు పెరిగాయి. కాగా అమెజాన్ వారు 45 కోట్ల వరకు ఆఫర్ ను ఖిలాడి సినిమాకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్ పై చిత్రయూనిట్ ఇంకా అంగీకారం తెలపలేదట. మరి మేకర్స్ ఆ ఆఫర్ కు ఓకే చేస్తారా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement