Thursday, November 7, 2024

అఫీషియల్ అనౌన్స్ మెంట్ @ఎన్టీఆర్31

ఎన్టీఆర్ 31వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. కే జి ఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 31 వ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement