Sunday, April 28, 2024

సింగర్ గా అదరగొట్టిన నివేదా థామస్… వీడియో వైరల్

సినీ ప్రేక్షకులకు నివేదాథామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే నివేదా థామస్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మాన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కూడా నివేద థామస్ నటించింది.

ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా తో కలిసి శాకిని ఢాకిని సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నివేద థామస్ తాజాగా గిటార్ పట్టుకుని కొత్త అవతారమెత్తింది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. కభీ.. కభీ.. అధితీ జిందగీ అంటూ పాడుతూ తనదైన స్టైల్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ వావ్ అనిపించింది. కాగా నివేద పాడిన ఈ పాట పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

బిగ్ బాస్ 5…ఈ సారి రానా వంతు ?

Advertisement

తాజా వార్తలు

Advertisement