Thursday, April 25, 2024

తప్పుడు ప్రచారాలు వద్దు… నివేదా పేతురాజ్ వార్నింగ్

బ్రోచేవరెవరురా, చిత్రలహరి, అలా వైకుంఠపురములో, రెడ్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. కాగా నివేదా పేతురాజ్ ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న పాగల్ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో లోనివేదా పేతురాజ్ నో కిస్ పాలసీని పాటిస్తున్నారు అంటూ వెబ్ సైట్ లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై కూడా నివేదా స్పందించింది.

మొదట నన్ను దర్శకుడు ఈ సినిమా కోసం ముద్దు సీను అడగలేదు. సినిమా స్క్రిప్ట్ మాత్రం చాలా ఆనందంగా ఉంది. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ నివేద ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సదరు వెబ్ సైట్స్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement