Monday, May 6, 2024

వెంకీ నితిన్ తో మరో సినిమా ?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల రంగ్ దే, చెక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వెంకీ కుడుముల తో నితిన్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే నితిన్ కోసం స్క్రిప్ట్ కూడా వెంకీ సిద్ధం చేశారట.

నితిన్ కి కూడా ఆ స్టోరీ లైన్ చాలా బాగా నచ్చిందట. అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి లోపు ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement