Sunday, May 5, 2024

దూకుడు మీదున్న‌ నితిన్.. “ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్” రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ మూవీకి వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రేష్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి & రుచిర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇవ్వాల‌ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కాగా మూవీలో నితిన్ స‌ర‌స‌న‌ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా నితిన్ ఈ సినిమాతో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. భీష్మ కాంబో మరోసారి రిపీట్ కానుండంటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బాగా ఉన్నాయి. అలాగే ఈ రెండింటితో పాటు మరో సినిమా కూడా అనౌన్స్ చేసారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ”తమ్ముడు” సినిమాను ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement