Sunday, April 28, 2024

Big Breaking | ఉప్పల్​ స్టేడియంలో కివీస్ భారీ స్కోరు​​.. నెదర్లాండ్స్​ టార్గెట్​ ఎంతంటే?

క్రికెట్ వరల్డ్ కప్​లో భాగంగా ఇవ్వాల (సోమవారం) న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య 6వ మ్యాచ్‌ జరుగుతోంది. హైదరాబాద్​లోని ఉప్పల్​లో జరుగుతున్న ఈ మ్యాచ్​లో నెదర్లాండ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్​ తీసుకుంది. దీంతో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. కాగా, కివీస్‌ బ్యాటర్‌లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి322 పరుగులు చేసింది. ఇక.. నెదర్లాండ్స్​ జట్టు 323 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​ చేయాల్సి ఉంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

న్యూజిలాండ్‌ బ్యాటర్‌లలో విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అంతకుముందు కివీస్‌ ఓపెనర్‌లు డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. జట్టు స్కోర్‌ 67 పరుగులు ఉన్నప్పుడు కాన్వే (32) వాన్‌ డెర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో బాస్‌ డీ లీడెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రచిన్‌ రవీంద్ర.. విల్‌ యంగ్‌తో కలిసి అర్థవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కాగా, జట్టు స్కోర్‌ 144 పరుగులు ఉండగా విల్‌ యంగ్‌ 70 (7 ఫోర్లు, 2 సిక్సర్‌లు) వాన్‌ మీకెరెన్‌ బౌలింగ్‌లో బాస్‌ డీ లేడేకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత 185 పరుగుల వద్ద రచిన్‌ రవీంద్ర 51 (3 ఫోర్లు, 1 సిక్సర్‌) వాన్‌ డెర్‌ మెర్వ్‌ బౌలింగ్‌లో ఎడ్వర్డ్ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన బ్యాటర్లు కూడా నెమ్మదిగా స్కోరు బోర్డుని పరుగెత్తించే ప్రయత్నం చేశారు. అయితే.. నెదర్లాండ్స్​ బౌలర్ల దాటికి కివీస్​ 7 వికెట్లు కోల్పోయి322 పరుగులు చేయగలిగింది.

ఇక.. ఇందులో కాన్వే (32), విల్​ యంగ్​ (70), రచిన్​ రవీంద్ర (51), మిచ్చెల్​ (48), గ్లెన్​ ఫిలిప్స్​ (4), మార్క్​ చాప్​మన్​ (5). టామ్ లాథమ్​ (53) పరుగులు చేశారు. శాంతనర్​ 36, హెన్రీ 10 పరుగులతో చివర్లో ఆకట్టుకున్నారు.

- Advertisement -

కాగా, నెదర్లాండ్స్​ జట్టులో ఆర్యన్​ దత్ 2, పాల్​వాన్​ మెక్రీన్​ 2, రిలోఫ్​ వాన్​డేర్​ మేర్వే 2, బాస్​డీలీడే 1 వికెట్లు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement