Thursday, May 2, 2024

హీరోయిన్ త్రిష పెళ్లి ఎప్పుడు?

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన త్రిష ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా త్రిష పెళ్లి విషయమై ఓ క్లారిటీ వచ్చింది. కొన్ని వారాల క్రితం కృష్ణ అనే ధనవంతుడైన చెన్నైకి చెందిన వ్యాపారవేత్త తో ఏడడుగులు వేయనున్నట్లు వార్తల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

కాగా అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. ఆ వార్తలు అబద్ధమని చెప్పుకొచ్చింది. అలాగే అంతకు ముందు త్రిష పుట్టినరోజు సందర్భంగా ఛార్మి ట్వీట్ చేస్తూ… బ్రహ్మచారిగా త్రిషకు చివరి పుట్టినరోజు అవుతుందని చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కానీ త్రిష నుంచి స్పందన రాలేదు. మరి ఇందులో ఏది నిజమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement