Friday, May 3, 2024

కార్తికేయ 2 నుంచి కొత్త అప్‌డేట్‌.. ట్రైల‌ర్ రిలీజ్ చేసిన సినీ బృందం

టాలీవుడ్ యంగ్ బోయ్‌ నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్ష‌న్ లో కార్తికేయ సీక్వెల్ వ‌స్తోంది. ఈ సినిమాను కార్తికేయ 2గా తీస్తున్నారు. దీనిపై ఇదివ‌ర‌కే రిలీజ్ అయిన మోష‌న్ పోస్ట‌ర్, గ్లింప్స్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కార్తికేయ 2 ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. మిస్టరీ, థ్రిల్లర్ జోన‌ర్‌లో వ‌స్తున్న ఈ సినిమా శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నారు. ట్రైలర్‌లోని అద్భుతమైన దృశ్యాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement