Wednesday, May 15, 2024

బాలీవుడ్ లో అడుగు పెడుతున్న నయన్ !! రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

సౌత్ లో తనకంటూ ఓ స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు హీరోయిన్ నయనతార. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పైగా ఆ సినిమాను ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పటివరకు సౌత్ కే పరిమితం అయిన నయనతార ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే తీసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి మూడు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. అయితే బాలీవుడ్ డెబ్యూ సినిమా కోసం రెమ్యూనరేషన్ గట్టిగానే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలోపెట్టుకుని ఏకంగా ఆరు కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తుందట నయనతార. అయితే అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement