Wednesday, May 8, 2024

పండగ షురూ.. సెప్టెంబర్ 10నే ‘టక్ జగదీష్’ రిలీజ్

కొన్నిరోజులుగా నాని నటించిన టక్ జగదీష్ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై పలురకాలుగా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు హీరో నాని ఈరోజు సస్పెన్స్‌కి తెర దించాడు. ఈ మేరకు నాని త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో విడుద‌ల చేస్తూ.. పండ‌గ‌కి మన ఫ్యామిలీతో ట‌క్ జ‌గ‌దీష్ చూద్దాం అని అన్నాడు. వీడియోలో ‘భూదేవిపురం చిన్న కొడుకు, నాయుడు గారి అబ్బాయి ట‌క్ జ‌గ‌దీష్ చెబుతున్నాడు.. మొద‌లెట్టండి’ అని నాని డైలాగ్ చెప్పారు. సెప్టెంబ‌ర్ 10న వినాయ‌క చవితి సంద‌ర్భంగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

నిన్నుకోరి, మజిలీ చిత్రాల ఫేం శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమాను గత వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్ ప‌రిస్థితులు కూడా పూర్తిగా కంట్రోల్‌లోకి రానుందన అమెజాన్ ప్రైమ్‌లోమూవీని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా ట‌క్ జ‌గ‌దీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement