Sunday, May 5, 2024

ఫుట్ బాల్ ప్లేయర్ గా న్యాచురల్ స్టార్ నాని ?

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే వీటితో కాకుండా మరో సినిమాకి నాని ఓకే చెప్పాడట. ఆ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనుందట. ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా లో నాని ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. స్క్రిప్ట్ విన్న వెంటనే నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. గతంలో కబడ్డీ నేపథ్యంలో భీమిలి కబడ్డీ జట్టు తీశాడు నాని. ఆ తర్వాత క్రికెట్ నేపథ్యంలో జెర్సీ సినిమా చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement