Sunday, May 5, 2024

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కే నో చెప్పిన మాస్ మహారాజా!!

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి సినీ అభిమానులకు కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే వెట్రిమారన్ లాంటి స్టార్ దర్శకుడికి నో చెప్పాడట మాస్ మహారాజా రవితేజ. అసలు విషయం ఏంటంటే వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన వడ చెన్నై సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ధనుష్, ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా సముద్రకని నటించిన ఈ సినిమా కథను దర్శకుడు వెట్రిమారన్ మొదట విజయ్ సేతుపతి కి చెప్పాడట. కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేవని విజయ్ సేతుపతి నో చెప్పాడట.

ఇక అదే సమయంలో తమిళనాడుకి షూటింగ్ నిమిత్తం వచ్చిన రవితేజకు కథ చెప్పాడట. రవి తేజ కి కూడా కథ చాలా బాగా నచ్చిందట. అయితే అప్పటికి కొన్ని సినిమాలను ఓకే చేయడంతో ఈ సినిమా చేయలేనని చెప్పాడట. అప్పుడే వెట్రిమారన్ ధనుష్ ను కలిసి ఈ సినిమాను ఓకే చేశాడట. ఇక ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వెట్రిమారన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement