Monday, November 29, 2021

‘శ్యామ్ సింగ్ రాయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

టక్ జగదీష్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మూవీ ‘శ్యామ్ సింగ్ రాయ్’. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్ గా నటిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాని డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. వరస ఫ్లాపుల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో కీలకం. మూవీ మంచి హిట్ అవుతుందని నాని గట్టి ధీమాలో ఉన్నాడు.   

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: హుజురా బాద్‌షా ఎవరు? ప్రచారానికి ఇంకా పది రోజులే!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News