Saturday, April 20, 2024

పనిమనుషులుగా చేరి.. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే..

నగరంలో నేపాలీ పనిమనుషుల చోరీల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది.. పనిపేరుతో ఇంట్లో పనిమనుషులుగా చేరడం, ఆ తర్వాత ఆ ఇల్లును లూటీ చేయడం అలవాటుగా మారింది.. ఈ తరహా చోరీలు నగరంలో వరుసగా చోటు చేసుకోవడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.. పనిపేరుతో ఇళ్లలో పనిమనుషులుగా చేరడం, ఆ తర్వాత ఇంటి యజమానికి నమ్మకం కుదిరేలా వ్యవహరించి, అదును చూసి ఇంట్లో ఉన్నది ఊడ్చుకోవడం చేస్తున్నారు. అనేకేళ్లుగా నగరంలో నేపాలీల దొంగతనాలు ఉన్నప్పటికీ తాజాగా ఇలాంటి దొంగతనాలు పెరిగిపోవడంతో పోలీసులుసైతం ప్రత్యేక దృష్టి పెట్టారు..

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : నేపాలీల దొంగతనాలు నగరంలో పెరిగిపోతు న్నాయి. దొంగతనాలు చేయడమే ఉద్దే శంగా పెట్టుకుంటున్న నేపాలీలు ముం దుగా పనిమనుషులుగా చేరుతున్నారు. ఆ తర్వాత ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఎంతఉందో తెలుసుకుని, సమ యం చూసుకుని చోరీ చేస్తున్నారు. దీం తో కొద్దిరోజుల తర్వాత ఇంట్లోఉన్న వస్తువులు, బంగారు ఆభరణాలతో చోరీ చేసి ఉడాయిస్తున్నారు. అయితే చోరీ చేస్తున్న సమయంలో నిందితులు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. చేతులు, కాళ్లు కట్టేసి మరీ దొంగతనాలు చేస్తుండ టంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

తాళ్లతో కట్టేసి చోరీలు..
సైపాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నేపాలీ దంపతుల చోరీతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీ హిల్స్‌ కాలనీలో నివాసం ఉండే ఓం ప్రకాష్‌ అగర్వాల్‌, సంతోష్‌ అగర్వాల్‌ అనే వృద్ధ దంపతుల ఇంట్లో ఇరవై రోజుల క్రితం నేపాల్‌కు చెందిన భార్యాభర్తలైన ఇద్దరు పనిమనుషులుగా చేరారు. వీరిలో భర్త దీనేష్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, భార్య అనితశేషి ఇంట్లో సహాయకురాలిగా ఉంటోంది. అయితే శనివారం తెల్లవారుజామున నేపాలీ దంపతులిద్దరూ యజమాని ఇంట్లో దోపిడికీ పాల్పడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఓం ప్రకాష్‌ అగర్వాల్‌ నోట్లో గుడ్డలు కుక్కి, తాళ్లతో కట్టేసి బీరువా తాళంచెవులు తీసుకున్నారు.
బీరువాలో ఉన్న రూ. 40 లక్షల విలువచేసే డైమండ్‌ ఆభరణాలు, రూ. 40లక్షల విలువచేసే బంగారు ఆభర ణాలు, రూ.5లక్షల నగదు తీసుకుని పరా రయ్యారు. తెల్లవారిన తర్వాత మేడపై నిద్రస్తున్న అగర్వాల్‌ కోలు, మనవడు కిందకు దిగివచ్చి చూసే సరికి అగర్వాల్‌ తాళ్లతో కట్టి వేయబడి ఉండటం చూశా డు. వెంటనే కట్లు విప్పి డయల్‌ 100 కు సమాచారం అందించారు. దీంతో సైపా బాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకు న్నారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు.

- Advertisement -

గతంలో రాయదుర్గంలో ..
రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధి లో ఇప్పటివరకు నేపాలీలు అనేకసార్లు చోరీలకు పాల్పడ్డారు. నెలక్రితం గచ్చి బౌలిలోని ఓ ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీలు ఇల్లుగుల్ల చేశారు. గచ్చిబౌలి టెలికామ్‌నగర్‌లోని ప్రముఖ వ్యాపారి బీరమ్‌ గోవిందరావు ఇంట్లో నాలుగు నెలల క్రితం నేపాల్‌కు చెందిన భార్యభర్తలు పనిలో చేరి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లిన యజమాని, ఇంట్లో చోరికి పాల్పడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాలను ఆఫ్‌చేసి, మెయిన్‌ స్విచ్‌ను బంద్‌చేసి ఇంట్లో ఉన్న లాకర్‌ని తెరిచి, అందులో ఉన్న 1.2 కిలోల బంగారు నగలు, రూ. 15 లక్షలు తీసుకుని పారిపో యారు. అయితే నేపాలీ దంపతులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మరిచిపోకముందే అదేతర హాలో సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పనిలో పెట్టుకునేముందు ఆలోచించండి..
నగరంలోని బంజారాహిల్స్‌, జూ బ్లిహిల్స్‌, ప్రశాసన్‌నగర్‌, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్‌, మణికొండ, సో మాజిగూ, బేగంపేట తదితర ప్రాంతా ల్లో సంపన్నులు తమ ఇళ్ల దగ్గర సెక్యూ రిటీ గార్డులుగా విధులు నిర్వహించే నేపాలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలో చేర్చు కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకు సంబం ధించి ఇప్పటికే నేపాలీ గ్యాంగ్‌ల వివరాలు, వారి నేరచరిత్ర ఆయా పోలీసు స్టేషన్లలో ఉందని, పని లో పెట్టుకునేముందు ఆ వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుతు న్నారు. లేదంటే ఖచ్చితంగా నేపాలీ గ్యాంగ్‌ల ఆగడాలకు మోసపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement