Monday, April 29, 2024

నాగ్ సినిమాలో నాగచైతన్య, సమంత ?

ఏం మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి చిత్రాలలో అభిమానులను ఆకట్టుకున్నారు సమంత, అక్కినేని నాగ చైతన్య. అయితే ఈ ఇద్దరు కూడా భార్య భర్తలు అన్న సంగతి కూడా తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ జంట మరోసారి జతకట్టబోతున్నారట. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కే బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సమంత కూడా నటించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఇద్దరు విన్నారట. అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగచైతన్య విషయానికొస్తే నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తీసిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement