Saturday, April 27, 2024

రెండో పెళ్లి ఆలోచన వస్తే పీక కోస్తా: నాగబాబు క్లారిటీ..

నాగబాబు రెండో పెళ్లి విషయం మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల నెటిజన్లతో జరిపిన లైవ్ చాట్‌లో తన రెండో పెళ్లి ముచ్చట గురించి ఓపెన్ అయ్యారు నాగబాబు.. ‘ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ఈ వయసులో నాకు పెళ్లా..? అయినా మీరంతా ఓకే అంటే నాకూ ఓకే’ అంటూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే మళ్లీ ఇదే విషయంపై మాట్లాడారు నాగబాబు.. తాజాగా అభిమానులతో జరిపిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్’ అని అడగ్గా.. ‘మా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు.. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను’ అంటూ చమత్కారం ప్రదర్శించారు. అయితే నాగబాబు వివరణ పై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement