Sunday, April 28, 2024

స‌మంత‌తో క‌ల‌సి న‌టించాల‌ని ఉంది….

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాల్‌ ఠాకూర్‌. బాలీవుడ్‌ లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటు-ంది. ”తనకు సమంతతో కలిసి నటించాలని ఉందంటూ” తాజాగా ట్విట్టర్‌ లో ‘ఆస్క్‌ సామ్‌ ‘ అనే హ్యాష్‌ ట్యాగ్‌ లో తన అభిప్రాయం తెలిపింది. సమంతను ఉద్దేశిస్తూ మృణాల్‌ ”..శాకుంతలం సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆతృతగా ఉన్నారు. సామ్‌.. మీరు చాలామందిని ఇన్స్‌స్పైర్‌ చేస్తున్నారు. మనిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేద్దాం..” అంటూ ప్రశ్నించింది. దీనికి సమంత కూడా వెంటనే రియాక్ట్‌ కావడం విశేషం.
మృణాల్‌ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పడం నెటిజన్స్‌ ను విపరీతంగా ఆకట్టు-కుంది. ఒక నెటిజన్‌ .. ”వావ్‌ మీ ఇద్దరూ కలిసి నటిస్తే..” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే సమంతకు కూడా మృణాల్‌ తో నటించడం ఇష్టమే అన్నట్టు-గా ఉంది. అందుకే వెంటనే రియాక్ట్‌ అయింది అంటు-న్నారు. సమంత శాకుంతలం ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఇక మృణాల్‌ ఠాకూర్‌ సీతారామం తర్వాత నాని సరసన నటిస్తోంది. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement