Sunday, May 19, 2024

Ravitheja: ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్రారంభం

మాస్‌ మహారాజా రవితేజ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి వీరాభిమాని, కొన్ని సినిమాలలో బిగ్‌బీని అనుకరిస్తూ అలరించారు. ఇక హరీష్‌ శంకర్‌తో రవితేజ చేస్తున్న ప్రాజెక్ట్‌కు ‘మిస్టర్‌ బచ్చన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల స#హ నిర్మాత. పనోరమా స్టూడియోస్‌, టి-సిరీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తుండగా, అయనం క బోస్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ కాగా, ఎడిటింగ్‌ ఉజ్వల్‌ కులకర్ణి. ఆదివారం చిత్రబృందం, అతిథుల సమక్షంలో ఈ చిత్రం ప్రారంభ మైంది. హిరో రవితేజ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, రఘు రామకృష్ణ స్ర్కీప్ట్‌ను దర్శకు డు హరీష్‌ శంకర్‌కి అందజేశారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కుమార్‌ మంగత్‌ పాఠక్‌ క్లాప్‌ కొట్టగా, కె.రఘు రామకృష్ణ, టీజీ భరత్‌ కలిసి కెమెరా స్విచాన్‌ చేసారు. ముహూర్తం షాట్‌కు వీవీ వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం షాట్‌ కోసం ”మిస్టర్‌ బచ్చన్‌… నామ్‌ తో సునా హోగా!” డైలాగ్‌ని చెప్పారు రవితేజ.

Advertisement

తాజా వార్తలు

Advertisement