Monday, April 29, 2024

ఇది ఛాలెంజింగ్‌ స్క్రిప్ట్‌ – ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ చిత్ర నిర్మాతలు

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ మా మైక్‌ మూవీస్‌ సంస్థలో ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటు-న్నాం. ఇటీ-వల మా సంస్థలో వచ్చిన స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ అయినా, ఇప్పుడు ఈ మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమా అయినా అలా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్‌ ను నమ్మే నిర్మించాం. ఈ కథలో మదర్‌ సెంటిమెంట్‌ బాగా నచ్చింది. అయితే మేల్‌ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్‌ స్క్రిప్ట్‌ మేము కూడా అలాగే తీసుకుని చేశాం. మేము సినిమా చూశాం. ఔట్‌ పుట్‌ మేము ఎక్స్‌ పెక్ట్‌ చేసినట్లే వచ్చింది. ఇటీ-వల మైత్రి డిస్ట్రిబ్య్రూషన్‌ వాళ్లు చూశారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. దాంతో మా కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. శ్రావణ్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ మా సినిమాకు ఆకర్షణ అవుతుంది.

మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌ తో బిజీగా ఉన్నారు. మేము ఒకటీ- రెండు సినిమాలు చేసి వెల్దామని అనుకోవడం లేదు. కొన్నేళ్ల పాటు- సెటిల్డ్‌ గా మూవీస్‌ నిర్మించాలని బ్యానర్‌ పెట్టాం. ఇప్పుడు నాలుగైదు సినిమాలు పైప్‌ లైన్‌ లో ఉన్నాయి. రెండు సినిమాలు షూటింగ్‌ జరుగుతున్నాయి. అన్నారు.

నిర్మాత వెంకట్‌ అన్నపరెడ్డి మాట్లాడుతూ – మా సంస్థలో ఇప్పటిదాకా నాలుగు సినిమాల్ని సక్సెస్‌ ఫుల్‌ గా రిలీజ్‌ చేశాం. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్‌ బాస్‌ చూసినప్పుడు ఆ గేమ్స్‌ లోని ఎమోషన్‌ ను సొహైల్‌ ఇంప్రెసివ్‌ గా చూపించాడు. మేల్‌ ప్రెగ్నెంట్‌ క్యారెక్టర్‌ ను సోహెల్‌ ఎంతో సహజంగా చేశాడు. అన్నారు.

నిర్మాత రవీందర్‌ రెడ్డి సజ్జల మాట్లాడుతూ – మా బ్యానర్‌ లో ముగ్గురం నిర్మాతలం కలిసే సినిమాలు చేస్తున్నాం. ఇలాంటి కథతో తెలుగులో మూవీ రాలేదు. ఇంగ్లీష్‌ లో వచ్చినా…అది ఎక్స్‌ పర్‌ మెంటల్‌ గా చేశారు. కామెడీ మీద బేస్‌ అయి ఉంటు-ంది. మేము ఈ సినిమా ప్రారంభించిన తర్వాత బాలీవుడ్‌ లో ఈ -టైప్‌ సినిమా ఒకటి వచ్చింది. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ యూనిక్‌ గా ఉంటు-ంది. ఎమోషన్స్‌, ఎంటర్‌ -టైన్‌ మెంట్‌ తో సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. అని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement