Friday, April 26, 2024

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “వారియ‌ర్”.. జులై 14న థియేట‌ర్ల‌లోకి

రామ్ పోతితేని ఎన్.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ‘ది వారియ‌ర్’ . ఈ చిత్రంలో రామ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన‌ ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే క్రియేట్ చేశాయి. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

కాగా.. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీ టీమ్ తాజాగా సెట్‌లో దిగిన ఫోటోస్‌ను షేర్ చేస్తూ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఫోటోస్‌ను గ‌మనిస్తే పాట‌తో షూటింగ్‌ను పూర్తి చేసిన‌ట్లు తెలుస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస‌ సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 14న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement