Thursday, April 25, 2024

ములకలేడులొ గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతి..

శెట్టూరు, (అనంతపురం) ప్రభన్యూస్‌ : గ్యాస్‌ లీకేజ్‌తో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా, శెట్టూరు మండల పరిధిలోని ములకలేడు గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపినమేరకు వివరాలు ఇలాఉన్నాయి. కొలిమి రజాక్‌ ఇంట్లో రాత్రి వేళలో గ్యాస్‌ లీక్‌ కావడంతో ఇంటి ఆవరణలో పూర్తిగా వ్యాపించింది. తెల్లవారు జామున దురదృష్టవశాతు గ్యాస్‌ లీక్‌ అయ్యిపెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు ఎగిరిపడటంతో పక్కన ఉన్న జైనిబి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమై నెలమట్టిమైంది. జైనిబి తో పాటు కుటుబ సభ్యులు అయిన జైనాభి(60), ఈమె కుమారుడు దాదు(36), కోడలు సర్ఫన్నీ(28), మనమరాలు ఫీర్డోస్‌(06) నిద్రలోనే అనంత లోకాలలో కలిసిపోయారు. సిలెండర్‌ పేలుడు ధాటికి రెండు పక్కా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీరిలో రజాక్‌, .అబ్దుల్లా .. వీరిద్దరూ తండ్రి కొడుకులు. వీరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్నఎస్‌ఐ యువరాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బంది, గ్రామ ప్రజల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. పేలుడు ధాటికి మరో మూడు పక్కా ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుబంలో నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో ఆగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్రంగా గాయపడిన రాజాక్‌.అబ్దుల్లా ను వైద్య చికిత్సల నిమిత్తం కళ్యాణ దుర్గానికి తరలించినట్లు ఎస్‌ఐ యువరాజ్‌ తెలిపారు.

గ్రామస్తుల ఆందోళన..

ఏజెన్సీ నిర్వాహకులు వినియోగ దారులకు సిలెండర్లను అందించే విషయంలో పకడ్బందీ గా చర్యలు చేపట్ట క పోవడంతో తరచు లీకేజ్‌ సంఘటనలు చోటు-చేసుకుంటు-న్నాయి. సంఘటన ప్రదేశానికి వెళ్తున్న ఇండియన్‌ ఏజెన్సీ నిర్వాహకులను రోడ్డుపై అడ్డగించి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్యాస్‌ వినియోగం పై కూడా అగ్నిమాపక సిబ్బంది, గ్యాస్‌ ఏజెన్సీ వారు అవగాహన సదస్సులు ఏర్పాటు- చేయక పోవడంతోనే ఇలాంటి సంఘటనలు తరచు చోటు చేసుకొంటున్నాయని గ్రామస్థులు మండిపడ్డారు. అనంతరం గ్రామస్తులకు నచ్చజెప్పి వెనక్కి ఎస్‌ఐ యువరాజ్‌ పంపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement