Sunday, April 28, 2024

సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి అరెస్ట్

సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై హైదరాబాదులో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కొంతమంది రైతులు. అందులో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే నారాయణ మూర్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ వ్యవసాయం ,విద్య, వైద్యం ను ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement