Friday, April 26, 2024

రావ‌ణాసుర‌లో ఛాలెంజింగ్ పాత్ర చేశా..

ఇలాంటి పాత్ర ఇప్పటి వరకు చేయలేదు అని నటి మేఘా ఆకాష్‌ అంటోంది. ఆమె రావణాసుర చిత్రంలో నాయికగా నటించింది. ఇందులో నాకి చాలా ఆసక్తికరమైన పాత్ర. అన్ని వేరియేషన్స్‌ ఉంటాయి. సినిమాలో కీలకమైన పాత్ర. షూటింగ్‌ సందడిగా సాగింది అని ఆమె పేర్కొంది. చిత్ర కథానాయకుడు రవితేజ పెద్ద స్టార్‌ అయినా సరే మాకు కష్టమని అనిపించిన సీన్‌ బాగా చేసేవరకు ఎదురుచూస్తారు. అలాగే బ్రేక్‌ సమయంలో ఆయన చెప్పే మాట లు ఉపయోగకరంగా ఉంటాయి. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అని మేఘ తెలిసింది. రావణాసురలో ఇంకా ఫారియా, పూజిత, దక్ష అను కూడా నటించారు. వీరితో నాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి అని చెప్పింది. తెలుగులో మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌తో నటించాలని ఉందని తన మనసులో మాట వెల్లడించింది మేఘా ఆకాష్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement