Sunday, May 5, 2024

బిఏ రాజుతో మెగాస్టార్ అనుబంధం

ప్రముఖ నిర్మాత బిఏ రాజు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి బిఏ రాజు తో ఉన్న బంధాన్ని గురించి చెబుతూ ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. బిఏ రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని.. షూటింగ్ స్పాట్ లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్ వోగా పని చేశారు. సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్ కి సంబంధించిన కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెజ్ బ్యాంక్ ఆయన.

ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్ లో ఎన్ని రోజులు ఆడింది.. 100 రోజులు 175 రోజులు 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు “ఎన్ సైక్లోపెడియా”లా సమాచారం అందించేంత ప్యాషన్ వున్న పత్రికా జర్నలిస్ట్.. మేధావి.. సూపర్ హిట్ సినీమ్యాగజైన్ కర్త, అనేక సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన బి.ఏ.రాజుగారు లాంటి వారు ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేగు! అన్న వార్త విని షాక్ కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement