Saturday, April 27, 2024

కంగనా రనౌత్….బాడీ గార్డ్ పై రేప్ కేస్

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ముంబైకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ ఒకరు కేసు పెట్టినట్లు తెలుస్తోంది. కుమార్ తో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని… గత ఏడాది జూన్ లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడని సదరు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే పలుమార్లు తన ఇంటికి వచ్చి శారీరకంగాకూడా లొంగదీసుకున్నాడని ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

తన నుంచి 50 వేల రూపాయలు తీసుకున్నాడని… తర్వాత ఏప్రిల్ 27న తన సొంత ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడని తెలిపిందట. ప్రస్తుతం తనతో ఫోన్ మాట్లాడటం లేదని, ఫోన్ చేస్తే అతనికి వేరే పెళ్లి చేస్తున్నట్లు కుమార్ తల్లి చెప్పిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ కేసుపై కంగనా రనౌత్ మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement