Monday, April 29, 2024

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ప్రారంభం..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచారు. ఇప్పుడు ఆయన ఖాతాలో నాలుగుకి పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరు.. గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఈ షూట్ లో చిరు సహా మరికొంతమంది కీలక నటులు కూడా పాల్గొన్నారట. ఈ సినిమాలో నటి కుష్భూ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరు కలిసి ‘స్టాలిన్’ సినిమాలో అక్క తమ్ముడిగా నటించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర షూట్ ఈరోజు ఊటీలో షురూ అయ్యినట్టు తెలుస్తుంది. . ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

  ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఆ జీవో సస్పెండ్‌ చేసిన హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement