Monday, April 29, 2024

పుట్టినరోజున రెండు చిత్రాలను లైన్ లో పెట్టిన మెగా స్టార్

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాల ప్రకటన వెలువడింది. చిరంజీవి నటించే 156, 157 చిత్రాలను వెల్లడించారు.కుమార్తె నిర్మాతగా చిరంజీవి తన 156వ చిత్రాన్ని ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవికి సుస్మిత స్టైలిష్‌గా వ్యవహరిస్తుంటారు. తండ్రి నటించే చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారు

.బింబిసార దర్శకుడితో…’జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌-టైనర్‌లో చిరంజీవి నటించనున్నారు. తొలి చిత్రం ‘బింబిసార’తో కొత్త ప్రపంచం సృష్టించిన దర్శకుడు వశిష్ట చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మించనున్నారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు ) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్‌, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement