Tuesday, September 21, 2021

నాని సోదరి స్పీడ్ మాములుగా లేదు@ మీట్ క్యూట్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాణిస్తునే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. అయితే తన సోదరి దీప్తి ని దర్శకురాలిగా పరిచయం చేస్తూ మీట్ క్యూట్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నాని స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

మిగిలిన భాగాన్ని కూడా శరవేగంగా చేస్తున్నారట. మొత్తం ఈ సినిమా 5 కథలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నాని సోషల్ మీడియా ద్వారా గతంలో వెల్లడించారు. ఐదు కథలకు సంబంధించి ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి నాని సోదరి దీప్తి ఈ సినిమాతో ఏ మేరకు హిట్ సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News