Friday, March 15, 2024

హాకీ కథ వెనుక ఉన్నది ఎవరు..?

మనదేశ క్రీడా హాకీ..కాని 41 సంవత్సరాలుగా మన దేశానికి ఒలింపిక్స్ లో అసలు పతకమే లేదు.. అంతేకాదు కొన్నిసార్లు ఒలింపిక్స్ కి క్వాలిఫై కూడా కాలేదు. మన దేశ క్రీడా హాకీ అయినప్పటికి క్రికెట్ తో పోల్చుకుంటే హకీకి ఆదరణ కరువు.. ఒకప్పుడు 1920 నుంచి 1950 లోపు జరిగిన ఒలింపిక్స్ లో మన దేశం ఒలింపిక్స్ లో దుమ్ముదులిపింది. ధ్యాన్ చంద్ ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేది. ధ్యాన్ చంద్ అనంతరం కూడా కొన్ని సంవత్సరాల పాటు హాకీలో మన ఆధిపత్యం స్పష్టం గా కొనసాగింది. అయితే ఆ తరువాత మెళ్లిమెళ్లిగా ఒక్కో స్టెప్పు దిగాజారుతు మన హాకీ జట్టు మ్యాచ్ ఆడుతుందంటేనే ఎవరు పట్టించుకోని స్థాయికి వెళ్లింది పరిస్థితి.. కారణాలైమైనా శిఖర స్థాయి నుంచి అధమ స్థాయికి ఇండియన్ హాకీ స్థాయి పడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మన జట్టు ఒలింపిక్స్ లో ఎట్టకేలకు ఓ పతకం సాధించింది. గత‌మెంతో ఘ‌న‌మైనా కొన్ని ద‌శాబ్దాలుగా హాకీలో మ‌న ఇండియ‌న్ టీమ్ ఆట దారుణంగా ప‌త‌న‌మ‌వుతూ వ‌చ్చింది. ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడ‌ల్స్ గెలిచిన చ‌రిత్ర ఉన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క‌నీసం అర్హ‌త సాధించ‌లేక చ‌తికిల‌ప‌డింది. అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇప్పుడు మ‌ళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడ‌ల్ గెలిచే స్థాయికి చేరింది. ఈ విజ‌యంలో ఫీల్డ్‌లో ఆడిన ప్లేయ‌ర్స్‌కు ఎంత పాత్ర ఉందో తెర వెనుక అంత‌కంటే ఎక్కువ పాత్రే ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ పోషించారు.

న్నాళ్లుగా ఇండియ‌న్ హాకీ టీమ్ స్పాన్స‌ర్‌గా స‌హారా కొన‌సాగింది. అయితే 2018లో టీమ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి స‌హారా త‌ప్పుకుంది. ఎవ‌రూ టీమ్‌ను స్పాన్స‌ర్ చేయ‌డానికి ముందుకు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో ఒడిశాలోని నవీన్ ప‌ట్నాయ‌క్ స‌ర్కారు హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్ల‌కుగాను హాకీని స్పాన్స‌ర్ చేయ‌డానికి ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే మ‌ళ్లీ ఇండియ‌న్ హాకీ టీమ్ రాత‌ను మార్చింది.

2014లో ఒడిశా ప్ర‌భుత్వం చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్య‌మిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్స‌ర్‌షిప్‌కు బీజం ప‌డింది. ఆ టోర్నీపై న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఆ త‌ర్వాత 2017లో ఒడిశా ప్ర‌భుత్వం స్పాన్స‌ర్‌గా ఉన్న క‌లింగ లాన్స‌ర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వ‌ర‌ల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వ‌హించింది. ఆ త‌ర్వాత 2019లో ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ ఫెడ‌రేష‌న్ మెన్స్ సిరీస్ ఫైన‌ల్స్‌, ఒలింపిక్ హాకీ క్వాలిఫ‌య‌ర్స్‌.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జ‌రిగాయి. ఇలా ఇండియ‌న్ హాకీ వేసే ప్ర‌తి అడుగులోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెర వెనుక హీరోగా ఉంటూ వ‌స్తున్నారు.

ఇది కూడా చదవండి: 6 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement