Thursday, May 23, 2024

ఖిలాడీ ట్రైల‌ర్ లో అదరగొట్టిన మాస్ మ‌హ‌రాజా..

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త‌రువాత‌.. ఇప్పుడు ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‏గా రాబోతుందని ముందునుంచే ఒక టాక్ వినిపిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, అన్నీ ప్రేక్షకులను ఏంతో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి ర‌వితేజ ఫ్యాన్స్ కు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో ఖిలాడి మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రవితేజ మాస్ యాంగిల్ మరోసారి చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రవితేజ కామెడీ యాంగిల్ కూడా ఇందులో ఉండనుంది. అలాగే అనసూయ, రవితేజ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో సీనియర్ హీరో అర్జున్.. విలన్ పాత్రలో నటించారు. అలాగే వెన్నెల కిశోర్.. మురళీ శర్మ, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్‏తో ఖిలాడిపై అంచనాలను మరింత పెంచేశారు మూవీమేకర్స్. అలాగే ఈ సినిమాతో రవితేజ మరోసారి అభిమానులు ఫుల్ మాస్ ఎంటర్‏టైనర్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement