Sunday, May 19, 2024

గుంటూరులో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి.. స్థలం కేటాయించ‌గానే నిర్మాణ పనులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు భూమి గుర్తింపు, కేటాయింపు దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ బదులిచ్చింది. కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకున్న వెంటనే అంచనాలను ఆమోదించి, నిర్మాణ ఏజన్సీని నిర్ణయించి పనులు మొదలుపెడుతామని స్పష్టం చేసింది.

ఉద్యోగుల స్టేట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (ఈఎస్‌ఐ) అనేది ఉద్యోగులకు కలిగే ప్రమాదాల సమయంలో రక్షణగా నిలుస్తుందని, వైద్య సేవలు అందించడానికి ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం, 1948 ప్రకారం ఒక బీమా అని ఎంపీ అన్నారు. నరసరావుపేటలోని ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ప్రాథమిక, మాధ్యమిక, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు, చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం వద్ద ఉన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీ, విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి ద్వారా, అనుబంధమైన మరో 7 ఆస్పత్రుల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement